కాంగ్రెసు,బీ జీ పిలకు ఓటేసి మోసపోవద్దు.సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

కాంగ్రెస్, బీ జె పీ పార్టీలకు ఓటేసి మరోసారి మోసపోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ,బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి తో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డ, ఎన్ బీ టీ నగర్, వికార్ నగర్, వడ్డెర బస్తీ, తబేలా తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఇండ్లపై నుండి పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్పొరేటర్ టి.మహేశ్వరి ఆధ్వర్యంలో వారికి క్రేన్ సాయంతో భారీ
గజ మాలను అలంకరించారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికిఓటు వేస్తే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఒకసారి ఏం పీ గా గెలిపించిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. కనీసం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కూడా లేరనే విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే పద్మారావు గౌడ్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ టి.మహేశ్వరి, సికింద్రాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి మేడే రాజీవ్ సాగర్, డివిజన్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, నాయకులు శ్రీహరి, శేఖర్, అఖిల్, అక్బర్, అజ్మత్, సి సత్యనారాయణ ,నరేష్.తాళ్ళ రాజయ్య,నరసింగరావు, మాణిక్ రావు.టి.శ్రీనివాస్ ,
శ్యాం సుందర్, నథీమ్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *