రాంగోపాలపెట్ లోనినల్లగుట్ట లోని ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,,ఏ ఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ.

సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో అభి వృద్ధి చేసే అభ్యర్థులను ఎన్ను కోవాలి…కోట నీలిమ.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలోఅభివృద్ధి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని,సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,
,ఏ ఐ సీ సీ సభ్యురాలు డా. కోట నీలిమ ఓటర్లను కోరారు. రాంగోపాలపెట్ డివిజన్ నల్లగుట్ట లో సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ
ఏ బ్లాక్ .బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యం లో ముస్లిం సోదరులు ఏర్పాటు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కోట నీలిమ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముస్లిం సోదరలు సహకరించాలని కోరారు. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి అత్యధిక మెజార్టీతోని గెలిపించలని కోరారు .చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్,బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీ లు అందరూ దానం నాగేందర్ కు హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు దానం నాగేందర్ స్నేహానికి విలువ ఇచ్చే మనిషి అని,ఆయన్ను గెలిపించడం కోసం ప్రతి ఒక్కరూ హస్తం గుర్తు పైన ఓట్లేసి గెలిపించండి అని గౌస్ మైనార్టీ నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఫయాజ్ ఖాన్.సలీం ఖాన్.మహమ్మద్ అశ్లామ్ ,త్రికాల మనోజ్ కుమార్ పెద్ద సంఖ్యలో మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *