మాగుంట, గొట్టిపాటి కలిసి పనిచేస్తున్నారంటే -అభివృద్ధి పరుగులే -టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి చంద్రబాబును సీఎంనే చేసే బాధ్యత మీది.. దర్శిని అభివృద్ది చేసే బాధ్యత నాది.. టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి

ప్రస్తుత ఎన్నికల్లో మాగుంట, గొట్టిపాటి కుటుంబాలు కలిసి పనిచేస్తున్నాయంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ఒంగోలు ఎంపీ టీడీపీ అయ్యలపాలెం, నాగంబొట్లపాలెం, తూర్పుగంగవరం, మాధవరం, కొత్తపాలెం, తాళ్లూరు గ్రామాల్లో గురు వారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారం లోకి రాగానే తాళ్లూరు ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మొగిలిగుండాల రిజర్వాయర్ నిర్మా ణపనులు గొట్టిపాటి లక్ష్మి పూర్తి చేయిస్తారని, అందుకు తమ సహకారం ఉంటుందని చెప్పారు. అలాగే నడికుడి-శ్రీకాహస్తి రైల్వేమార్గాన్ని త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో వృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు జరిగి, ప్రజాస్వామ్యం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా. ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేయడం పరిపాటైందన్నారు. నియోజకవర్గానికి తాను వచ్చిన నాటి నుంచి ఎండను లెక్క చేయక తన వెంట నడుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు పెట్టు కున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ. ఇచ్చారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి మాగుంట, తనను గెలి పించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గోరంట్ల రవికుమార్, మండల టీడీపీ ఆధ్యక్షుడు బి.ఓబుల్ రెడ్డి, టీడీపీ నేత ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మాగుంట చందనారెడ్డి, బొద్దికూరపాడు నేతలు పొలంరెడ్డి రమణారెడ్డి, బూచిరాజు బాలశంకరరావు, శ్రీను, ఆర్.వెంకట్రావు, వెలుగువారిపాలెం నేతలు శాగం కొండా రెడ్డి, గోవిందరెడ్డి, వీరనాగిరెడ్డి, చెన్నారపు నాగేశ్వరరావు, నాయకులు గొంది రమణారెడ్డి, వేణు, నాగంబొట్లపాలెం నేతలు పాశం సూరిబాబు, పి.రమేష్ బాబు వేడి కోల లక్ష్మిరెడ్డి, యాతం శ్రీనివాసరెడ్డి, తూర్పు గంగవరం నేతలు రామలక్ష్మయ్య, చందన, ఇమ్మానియేల్, జాన్సామ్యేల్, మాధవరం నేతలు నుసుం వెంకటేశ్వ రెడ్డి, సోము శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, పాలెపోగు దాసు, నన్నయ్య ,తాళ్లూరు నేతలు ఐ.వి.రమణా రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనపర్తి సుబ్బారావు, నాదెండ్ల శ్రీను, మెలికా అంజమ్మ తదితరులు పాల్గొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *