విఠలాపురంలో బూచేపల్లి కి బ్రహ్మరథం పట్టిన ప్రజలు -ఇంటింటా ప్రచారం -ఇంటింటికి ప్రచారం నిర్వహించిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని

తాళ్లూరు మండలంలోని విఠ లాపురంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తన కోడలు నందినితో కలిసి గురు వారం ఇంటింటా ప్రచారం చేశారు. సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు బూచేపల్లి కుటుంబానికి బ్రహ్మ రథం పెట్టారు .ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ, నందినిలు ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపా లనలో ప్రజలకు చేకూరిన లబ్దిని కుటుంబాల వారీగా వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సకాలంలో పింఛన్ నగదు చేతికి అందాలంటే జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. మహిళలకు అందాల్సిన వైఎస్సార్ చేయూత నగదును, విద్యాదీవెనను సకాలంలో అందకుండా చంద్రబాబునాయుడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు. అవన్నీ జగనన్న సీఎం కాగానే నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తార న్నారు. బూచేపల్లి కుటుంబం 20 ఏళ్లుగా మీకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శివప్రసాదరెడ్డి ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయా ల్లోకి వచ్చారని వివరించారు. ఓటమి భయంతోనే తన కోడలు నందినిపై ప్రతిపక్షాలు ఫేక్ ఆడి యోలు సృష్టించి అగౌర పరిచేలా చూస్తూకుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. వదంతులు నమ్మోద్దన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తన భర్త శివప్రసాదరెడ్డి గెలుస్తున్నారని నందిని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే మన పార్టీలో నాయకుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తు న్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వారి మాయమాటలు నమ్మే పరిస్థితిలో మన నాయకులు లేరన్నారు. మన జగనన్నపైనే అనేక ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టిస్తున్న టీడీపీ వారికి తనపై క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదన్నారు. మహిళలంటే టీడీపీ నాయకులకు చులకన భావన ఉందనడానికి ఈ ఫేక్ ఆడియోనే ఒక ఉదాహరణ అని ప్రజలకు వివరించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కరరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ల సంఘ మండల అధ్యక్షుడు మారం ఇంద్రసే నారెడ్డి, జడ్పిటిసి మారం వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టివి సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు కైపు అశోక్ రెడ్డి, జాస్తి నరసిం హారావు, పాలం పెదసుబ్బారెడ్డి, కోట లక్ష్మీరెడ్డి, జనార్దన్, కుర్చేటి శ్రీను, గంథం బుజ్జీ మహనీల్, కోటిరెడ్డి, అంజిరెడ్డి, పాలెపోగు రమేష్ పాల్గొ న్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *