రాష్ట్రంలో జగనన్న ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని బిగ్ బాస్ ఫేం. టీవీ సీరియల్ నటుడు అర్జున్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో ఆర్జున్ రెడ్డి కి మామలు వైఎస్సార్ సీపీ నాయకులు, ఎస్ఆర్ఐ గూడా శ్రీధర్ రెడ్డి, ప్రసాదరెడ్డిలతో కలిసి గురువారం రాత్రి దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డికి మద్దతుగా ఎన్ని కల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల అభి వృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీలు ఏకమై జగనన్నను ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. జగనన్నకు మనందరం అండగా నిలుద్దామన్నారు. దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి పేదల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు. ఆయన బాటలో పయనిస్తూ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కుటుంబం దర్శి నియోజకవర్గంలో బీవీఎస్సార్ ట్రస్టు ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపడుతూ పేదలకు సహాయ సహకారాలు అం దిస్తోందని పేర్కొన్నారు. అలాంటి వారితో ప్రజలకు ఇంకా మేలు జరగాలంటే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. తన మామయ్యలు కోరిక మేరకు వారి చేస్తున్న మంచికిగాను తానూ కూడా బూచేపల్లి కుటుంబానికి తన వంతు సహకారం అందించేందుకు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను లోకల్ కాకున్నా తన మామయ్యల శ్రీధర్ రెడ్డి, ప్రసాదరెడ్డిల సహకా రంతో జగనన్న కోసం, శివన్న కోసం ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రజల కోసం అనేక సహాయ సహకారాలు అందిస్తున్న మన శివన్న గెలుపులో మీరందరూ భాగస్వాములు కావాల న్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి బాస్కరరెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని అర్జున్ రెడ్డి కోరారు. వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి చిన్నపు రెడ్డి మస్తాన్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ మెంబర్ షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి), జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందారెడ్డి, గూడా గోపాలరెడ్డి, చిన బ్రహ్మారెడ్డి, గుంటి గంగా ఆలయ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, యత్తపు మధుసూదన్ రెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, సింగారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామకృష్ణ, గువ్వల తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పెరుపాక కోటేశ్వరరావు, మండల ఎస్సీసెల్ నాయకులు పూనూరి దేవదానం, దయానందం, మరియరాజు పాల్గొన్నారు.
