బేగంపేట ప్రకాష్ నగర్ స్పానిష్ మజీద్ వద్ద సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ కు హస్తం గుర్తు పైన ఓట్లేసి గెలిపించండి అంటూ శుక్రవారం మజీద్ లో ప్రార్థనలు ముగిసిన అనంతరం సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్,బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు,బేగంపేట కాంటెస్టెడ్ కార్పొరేటర్ షేక్ గౌస్ కోరారు.సికింద్రబాద్ పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్ ను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోనే గతం లో కూడా మైనార్టీ లకు సంక్షేమ ఫలాలు అందాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం లో బీ జే పి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.అందుకే ఈ ఎన్నికల్లో దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అశ్లం తదితరులు వున్నారు.


