తాళ్లూరు మండలం లోని బొద్దికూరపాడు గ్రామ సమీపంలో మిరపకోత కూలీల ట్రాక్టర్ పై నుండి పడి గడ్డం రాజ్యలక్ష్మి (38) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీ సులు, స్థానికులు తెలి పిన వివరాలు… గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాది గ్రామానికి చెందిన పలువురు కూలీలు మిరప కోత కొరకు వచ్చి గ్రామంలో ఉంటున్నారు. శుక్రవారం మిరప కోత పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ డోర్ ఊడి పడడంతో ట్రాక్టర్ డోర్ పక్కనే కూరున్న గడ్డం రాజ్యలక్ష్మి ప్రమాదవ శాత్తు కిందపడింది. దీంతో ట్రాక్టర్ టైర్ ఆమె భుజంపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి స్వగ్రామం బొద్దికూర పాడు. మృతురాలికి భర్త, ముగ్గురు ఆడ పిల్లలు, మగ పిల్లాడు ఉన్నారు. ధామస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వైవీ రమణయ్య తెలిపారు.

