అరాచకం సృష్టించాలని చూస్తున్నారు-కడియాల రమేష్ అనే వ్యక్తి 150 మంది రౌడీలను దర్శిలో దించారు-అతనిపై అనేక కేసులున్నాయి.-పోలింగ్ రోజు అల్లర్లు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి -ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి. -జగనన్న పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది-వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి

ప్రశాంతంగా ఉండే దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ రోజు ఆరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. దర్శి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం తన తల్లి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… కడియాల రమేష్ అనే వ్యక్తి 150 మందికిపైగా రౌడీలు, ఆరాచక శక్తులను దర్శి తీసుకొచ్చి అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. రమేష్ పై అనేక కేసులున్నాయంటూ ఆ కేసుల వివరాలను డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చదివి వినిపించారు. స్థానిక పోలీసులు సకాలంలో స్పందించి పకడ్బందీగా తగిన చర్యలు తీసు కోకపోతే ప్రశాంతమైన దర్శిలో ఆరాచకం సృష్టించే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా ఆ కష్టాలను మరిపించేలా ప్రజలకు ఎటువం టి లోటు తలెత్తకుండా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఒకసారి నమ్మితే జగన్ అంటే ఎంటో ప్రజలకు చూపించారన్నారు. ఊహించని స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపిం చడం దేశంలో ఒక్క జగనన్నకే సాధ్యమైందన్నారు. మళ్లీ జగనన్న సీఎం అయిన వెంటనే అందించే సంక్షేమం. అభివృద్ధి ఫలాలు ప్రజలు ఊహించలేనంత గొప్పగా ఉంటాయని చెప్పాడు. ఇప్పటికే జగనన్న ఇచ్చిన పధకాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మేలు చేశాయన్నారు. సచివాలయాలు, ఆర్సీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు, ఇంగ్లిషు మీడియం చదువులు, పథకాలు గ్రామం లో పేదలకు అండగా నిలిచాయని బూచేపల్లి వివరించారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలు చేయాలని చూస్తోం దని చెప్పారు. కూటమి అబద్దాల హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ప్రజలంతా మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంని చూసేం. దుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని వివరించారు. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనకు ప్రజలు విసిగి వేసాగిపోయారని అన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్సార్ సీపీని గెలిపించడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈసారి కూడా చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు.
మా హయాంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి… తమ హయాంలో దర్శి నియోజకవర్గంలో అనేక సబ్ స్టేషన్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ప్రజలకు మేలు చేశామని బూచేపల్లి శివప్రసా దొరెడ్డి తెలిపారు. దర్శి మున్సిపాలిటీలో తాగునీటి కోసం రూ.120 కోట్ల టెండర్లు పూర్తయ్యాయన్నారు. మొగిలిగుండాల చెరువును కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం ఎన్నికల ప్రచారంలో దర్శికి వచ్చినప్పుడు ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో చెరువులను సాగర్ జలాలతో నింపుతామని చెప్పార న్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు తామే స్థాపించి ఇక్కడి ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలంతా తమ కుటుంబాన్ని 20 ఏళ్లుగా ఆదరిస్తున్నారని. ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా మాకు చేతనైన సాయం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ,ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలోమండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, ఎంపీపీ సుధాఅచ్చయ్య, ముండ్లమూరు జేసీఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *