సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయాన్ని బేగంపేట కార్పొరేటర్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్పొరేటర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతులు మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరినీ చల్లగా ఆయురారోగ్యాలతో వుండేలా చూడాలి అని కోరుకున్నమన్నారు.
