విద్యా, వసతి దీవేనలను త్వరిత గతిన ఆప్డేట్ చెయ్యాలి- సాంఘిక సంక్షేమ శాఖడిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మా నాయక్- వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహణ

ప్రభుత్వం అందించిన విద్యా వసతి దీవేనలను ఎప్పటికప్పుడు ఆప్డేట్ చేస్తూ కళాశాలలకు అందించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రొత్సహించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డిడి) ఎన్ లక్ష్మా నాయక్ అన్నారు. అంబేడ్కర్ భవన్లో బుధవారం ఒంగోలు డివిజన్ పరిధిలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కళాశాల కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ మాట్లాడుతూ జిల్లాలోని డిగ్రీ ఆపై ఉన్న అన్ని కళాశాలలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరముకు విద్యాదీవేన, వసతి దీవేనలకు సంబంధించి లబ్ది చేకూరే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జాయింట్ ఖాతాలు ఇప్పటి వరకు అప్డేట్ కాని వాటిని పున రుద్దరించుట, 2019-20, 2022-23 విద్యాసంవత్సరములలో తల్లుల ఖాతాలను నగదు చెల్లించినా కళాశాలలకు చెల్లించని వారిని గుర్తించి వారికి చెప్పి నగదు చెల్లించే విధంగా చర్యలు తీసుకుని నవశకం లాగిన్లో నమోదు చెయ్యాలని చెప్పారు. 2023-24 విద్యాసంవత్సరంలో 5 స్టెప్స్ వెరిఫికేషన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కారణాలను నవశకం లాగిన్ అప్డేట్ చెయ్యాలని కోరారు.
ఎన్పీసీఐ పెండింగ్ లో ఉన్న ఎస్సీ విద్యార్థుల ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయించాలని సూచించారు. త్వరిత గతిన తగిన విధంగా విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు. పనిపట్ల నిర్లక్షగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. కార్యక్మంలో ఒంగోలు, కొండెపి సహాయ సాంఘిక సంక్షేమాధికారులు ఎం. ఉదయశ్రీ, యు దానయ్య, కె శ్రీనివాసులు, సహాయ గిరిజన సంక్షేమాధికారి అమర సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *