ఒంగోలు నగరంలోని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ పిల్లలకు ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ వేల్పేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉచిత నోట్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు సంఘ కార్యదర్శి వసంత్ తెలిపారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు నోట్ పుస్తకాలు ఇవ్వటానకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అట్టి పిల్లలు ఉన్న జర్నలిస్ట్‌లు వారి పేర్లను ఈనెల 31వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘ బాధ్యులు కోరారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు: 9182095153, 9000451933లను సంప్రదించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీకి శ్రీకారం
22
May