శిక్షణ లో నేర్చుకున్న మెలుకువలతో మేరుగైన వైద్యం అందించాలి జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ కె బేబి రాణి – 62 మంది పశుసంవర్ధక శాఖ సహాయకులకు ముగిసిన శిక్షణ

పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వం నూతనంగా నియమించిన 62 మంది పశుసంవర్థఖ శాఖ సహాయకులకు 45 రోజు పాటు జరిగిన శిక్షణా కార్యక్రమం బుధవారం శిక్షణ ముగిసింది. ఈసందర్భంగా డీఎడీఏ సమావేశపు మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పశుసంవర్థశాఖాధికారి డాక్టర్ కె. బేబి రాణి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న పశుసంవర్ధక శాఖ సహాయకులు నేర్చుకున్న విషయాలను క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి వారికి చక్కగా ఉపయోగపడి పాడి- పరిశ్రమ వృద్ధికి తోడ్పాలు ఇవ్వాలని కోరారు. వృత్తిలో రాణిస్తే మంచి గుర్తింపు వచ్చి మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన పశువైద్య సహాయకులు ఎస్ రవి, సిహెచ్ నీరజ, షేక్ తస్లీం, పి. శివ ప్రసాద్ కు పొత్సాహక బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో డీఎల్డీఏ కార్యనిర్వాహణాధికారి, ఉప సంచాలకులు డాక్టర్ షేక్ కాలేషా, శిక్షణా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస రెడ్డి, రిసోర్స్ పర్సన్, సహాయ సంచాలకులు డాక్టర్ బసవ శంకరరావు, డాక్టర్ నాగభూషణం, పశువైద్యులు డాక్టర్ సాంబ శివ రావు, డాక్టర్ సాహితీ, డాక్టర్ స్వాతి, డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *