ఓ బీ సీ రిజర్వేషన్ల విషయం లోకలకత్తా హై కోర్టు తీర్పుపై ఓ బీ సి నేతల హర్షం…

ఓ బీ సీ రిజర్వేషన్ల విషయం లో కలకత్తా హై కోర్టు ఇచ్చిన తీర్పు పై బీ జే పి ఓ బీ సి నేతలు హర్షం వ్యక్తం చేశారు.గురువారం బేగంపేట బ్రాహ్మణ వాడి లో సనత్ నగర్ నియోజక వర్గం బీ జే పి ఓ బీ సి మోర్చ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో బీ జే పి ఓ బీ సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చీరె సత్యనారాయణ (శ్రీకాంత్) మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందన్నారు. ఓ బీ సి లలో పలు క్లాసులను న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబిసి ధృవపత్రాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందనీ ఇది హర్ష నీయమణి సత్యనారాయణ (శ్రీకాంత్)అన్నారు.
బిజెపి ఓబిసి మోర్చా సనత్ నగర్ అసెంబ్లీ ఓబీసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోబిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చీర శ్రీకాంత్ గారు, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ , అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, బేగంపేట్ డివిజన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, రాంగోపాల్ పేట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, బీ జే పీ నాయకులు పవన్ కుమార్ పాతక్, వెంకటేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *