వికే జూనియర్ కళాశాలలో శుక్రవారం నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 247 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12గంటల మధ్య మొదటి సంవత్సరం, రెండున్నర గంట నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. కేంద్రం చీఫ్ సూపరిండెంట్‌గా గురవయ్య, అడిషనల్ చీఫ్ సూపరిండెంట్‌గా ఎస్ లలిత బోస్ విధులను నిర్వహించనున్నారు.
