చర్లపల్లి.సనత్ నగర్ రైల్వే స్టేషన్ లను తనిఖీ చేసిన జీ ఏం అరుణ్ కుమార్ జైన్.

చర్లపల్లి, సనత్‌నగర్ రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ లో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (నిర్మాణం) శ్రీ.నీరజ్ అగ్రవాల్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీ కె.ఆర్.కె.రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ సి. మధుసూధన రావు, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ బి. నాగ్య, సికింద్రాబాద్ డివిజనల్‌ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్‌ కుమార్‌ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ జంట నగరాల కోసం సరికొత్త మరియు ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి లో రాబోయే కోచింగ్ టెర్మినల్‌కు సంబందించిన పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని ఆధికారులు జీ ఎమ్ కి వివరించారు. కోచ్ నిర్వహణ సౌకర్యాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ కొత్త టెర్మినల్ అంతర్ జాతీయ విమానాశ్రయానికి సమానంగా సరికొత్త ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంజరుగుతోంది.
ఈ స్టేషన్‌ను అనేక అత్యాధునిక సౌకర్యాలు మరియు ప్రయాణీకుల సౌకర్యాలతో దాదాపు రూ. 430 కోట్లవ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. నూతన స్టేషన్ భవనం ఆధునిక ముఖభాగంతో ప్రయాణీకుల రాకపోకలకు అనుగుణంగా నిర్మించబడుతోంది. ఈ స్టేషన్ భవనంలో ఆరు బుకింగ్ కౌంటర్లు, స్త్రీలకు మరియు పురుషుల కొరకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్, అలాగే ఉన్నత-శ్రేణి వెయిటింగ్ ఏరియా మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి అంతస్తులో మహిళలు మరియు పురుషుల కోసం ఫలహారశాల, రెస్టారెంట్ మరియు రెస్ట్‌రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు మరియు ముఖద్వారం అధునాతన లైటింగ్‌తో గొప్ప ఎలివేషన్ను కలిగి ఉంటుంది. ఈ స్టేషన్ ఏం. ఏం. టి. ఎస్ – ప్రాజెక్ట్ రెండవ దశ కింద కూడా వస్తుంది.
పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న 5 ప్లాట్‌ఫారమ్‌లు పూర్తి నిడివి కలిగి 24 బోగీలు గల రైళ్లను ఆపేందుకు అనుగుణంగా విస్తరించడంతోపాటు మరో 4 అదనపు ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి. వీటితోపాటు ప్రయాణీకులు ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి ఇంకొక ప్లాట్‌ఫారం కు వెళ్ళే వీలుగా 12 మీటర్ల వెడల్పు మరియు మరొకటి 6 మీటర్ల వెడల్పు కలిగిన రెండు నూతన పాదాచారుల వంతెనలు ఏర్పాటుచేయబడ్డాయి. మొత్తం 9 ప్లాట్‌ఫారమ్‌లలో ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి 7లిఫ్టులు మరియు 6ఎస్కలేటర్లు ఏర్పాటుచేసారు. ఈ స్టేషన్ నుండి రైళ్లను నడిపేందుకు కోచ్ నిర్వహణ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది.
తదనతరం జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ చర్లపల్లి-మౌలా-అలీ-అమ్ముగూడ-సనత్‌నగర్ సెక్షన్ మధ్య రియర్ విండో తనిఖీని చేపట్టారు. జనరల్ మేనేజర్ సనత్‌నగర్ రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని డివిజన్‌లోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *