పవిత్ర పుణ్యక్షేత్రం తూర్పుగంగ
వరం పంచాయతీ పరిధిలోని గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గుంటి గంగాభవానీ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మతల్లికి పొంగళ్లు పెట్టి నైవేథ్యం స మర్పించారు. తాళ్లూరు పరిసర మండల గ్రామాలకు చెంది న భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు రావటంతో సందడిగా మారింది. అర్చకు లు ఎన్.కామేశ్వరశర్మ, ప్రకాశ్రావు అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పి.కార్తిక్, ఆలయ కమి టీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
