రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పటిష్ఠ మైన భద్రతా ఏర్పాట్లు -బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీ సీ పి సాలె రంగారావు

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పటిష్ఠ మైన ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు.ఇదే సమయం లో రాష్ట్రం నుంచి తరలి వస్తున్న వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట మైన ఏర్పాట్లు చేస్తున్నామని బేగంపేట ట్రాఫిక్ అడిషనల్ డీ సీ పి సాలె రంగారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాలకు మాత్రమే పరేడ్ మైదానం వద్ద పార్కింగ్ వసతి కల్పిస్తున్నామన్నారు.అలాగే రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్న 300 బస్సులకు పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు.జింఖానా మైదానం లో ఎమ్మెల్యే లు,ఎమ్ పి లు,అమర వీరుల కుటుంబ సభ్యుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.అలాగే అత్యవసర పరిస్థితులలో ఎస్ బి ఐ. వై ఎమ్ సీ ఏ ,సి టి ఓ,తా డ్ బండ్ క్రాస్ రోడ్ లలో ట్రాఫిక్ డైవర్షన్ ఇస్తున్నామని అడిషినల్ డీ సీ పీ తెలియజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీ పే కొత్త కోట శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో డీ సీ పీ సుబ్బారాయుడు, అడిషనల్ డీసీపీ రంగారావు లు ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు తో ఈ బందోబస్తు లో 4 గురు ఏ సీ పీ లు,24 మంది ఇన్స్పెక్టర్ లు,ఎస్సై లు తదితరులు 450 మంది ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు లో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.వాహన దారులు ఎవరికీ కేటాయించిన పార్కింగ్ లోనే వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *