అనధికార బ్యారన్లు నిర్మించవద్దు – పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ ఎం. లక్ష్మణరావు

పొగాకు సాగు చేయు రైతులు అనధికార బ్యారన్ లు ఎట్టి పరిస్థితులలో నిర్మించవద్దని పొగాకు బోర్డు రీజనల్ మెనేజర్ ఎం. లక్ష్మణరావు కోరారు. పొగాకు ధరలు అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉటుందని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న ధరలను చూసి రైతులు అత్యాత్సాహంతో బ్యారన్ లు నిర్మించి చేతులు కాల్చుకోవద్దని హితవు చెప్పారు. పొగాకు సాగు చేయు రైతులు పచ్చి రొట్ట పైర్లు అయిన జనుము, పిల్లిపిసర సాగు చేసి కలియదున్నినట్లయితే భూసారం మరింత పెరిగి కర్బనం బౌతిక లక్షణాలు పెంపొందించుతాయని చెప్పారు. ముఖ్య పోషకాలైన నత్రజని, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం మరియు ఐరల్లను పొగాకు మొక్కకు అందుబాటులో ఉండే విధంగా పచ్చిరొట్ట పైర్లు చేస్తాయని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *