మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని పట్టణంలోని పలువురు డివిజన్ బాధ్యులు గురువారం హైదరాబాద్లో కలిసారు. ఒంగోలులో తమ డివిజన్లో పోలింగ్ జరిగిన తీరుపై చర్చించారు. ఎమ్మెల్యేగా విజయదుందుబీ మోగించి మంత్రిగా మరలా సేవలు అందించాలని ఆకాంక్షించారు. పలు విషయాలపై చర్చించారు. 47వ డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసరావు, పసుపులేటి దిలిప్ కుమార్, ఇంకొల్లు హరీష్ కుమార్, 49వ డివిజన్ బత్తుల కాశయ్య తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
