నరేంద్రునికి అభినందనలు- ప్రకాశం జిల్లా మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు -భారతదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుందని ఆకాంక్ష.

ఎన్డీఏ కన్వీనర్ గా మరోసారి ఎన్నికైన సందర్భంగా దామోదర్ దాస్ నరేంద్ర మోడీ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశ ప్రధానిగా మూడవసారి జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న మీకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు శుభాకాంక్షలు తెలుపుచున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తొలిసారి 2014 సం.లో భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి మీరు తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలో గుర్తింపు పొందింనదనడంలో ఎలాటి సందేహం లేదు.

సామాన్య మానవుడికి కావలసిన కూడు గుడ్డ నీడ అనేవాటిని తీసుకుంటే భారతదేశంలో ఉన్న 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్నాయోజన పథకం ద్వారా ఉచితంగా ఐదు సంవత్సరాలపాటు నిర్విరామంగా అందిస్తున్న ఘనత మీకు, మీ ప్రభుత్వానికే దక్కుచున్నది.

టెక్స్ టైల్ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చి చేనేత రంగానికి మీరిచ్చిన ప్రోత్సాహం ఎంతో విలువైనది. మీ యొక్క పిలుపుతో ఖాదీ పరిశ్రమ ఎంతో ఆశాజనకంగా ముందుకు వెళుతున్నదనడంలో అతిశక్తి కాదు. యువత సైతం ఖాదీ వస్త్రాలు ధరించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా భారతదేశంలోని నిరుపేదలందరికీ ఉచితంగా ఇంటి నిర్మాణం, స్వచ్ఛభారత్ పేరిట మరుగుదొడ్ల నిర్మాణం, అమృత నగరాల సృష్టి, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవడంతో మీ ప్రాముఖ్యత, ప్రావీణ్యత శ్లాంఘించదగినది.

అన్ని వ్యవస్థలను చాకచక్యంగా గాడిలొ పెట్టారు. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలని రక్షణ రంగాన్ని ఎంతో బలోపతం చేశారు. అగ్నిపథ్ పేరిట యువతను సైనికులుగా తీర్చిదిద్దారు. ఈ 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా ఊపిరి పీల్చుకొంటున్నారంటే సైనిక పాటవాన్ని ఆధునికీకరణ చేయడమే…

మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాలలో మీరు తీసుకున్న శ్రద్ధ ఎంతో అమోఘం. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఫలాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందుచున్నారంటే బ్యాంకింగ్ రంగంలో తెచ్చిన మార్పులు, ప్రతి ఒక్కరూ జన్ ధన్ ఖాతా కలిగి ఉండటం, ప్రభుత్వ ఫలాలు నేరుగా ఆ ఖాతాలో జమ కావడం.

ఒక మాటలో చెప్పాలి అంటే బిడ్డ పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు, రైతులకు, ప్రతి ఒక్కరికి మీరు అందించిన చేయూతతో ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ పరిపాలన దక్షతను ప్రపంచ దేశాలు గుర్తించాయి, కీర్తిస్తున్నాయి.

మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీ సాధించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ. రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేస్తారని భారతీయ పౌరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

భారతదేశ ప్రధానమంత్రిగా మూడవ విడత ప్రమాణ స్వీకారం చేస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ… శుభ ఘడియలు కోసం భారత ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారని ధనిశెట్టి రామునాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *