తొలిసారిగా ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించి, రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై సత్య కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనివాసరావు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అనితర సాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసి చూపిన సత్య కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటితమైనప్పటి నుండి ధర్మవరం పరిసర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేసి స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన పొంది వాని పరిష్కారానికి కావలసిన విధివిధానాలను రూపొందించుకున్నారని, వానిని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్లి ఎన్నికల్లో ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. అంతే కాకుండా గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను, రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న కూటమి లక్ష్యాలను ప్రజలకు తెలుపుతూ ఎన్నికల క్షేత్రంలో నిలబడ్డారని తద్వారా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారని తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకుడిగా… పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఓ ఎస్ డి గా పనిచేశారని, పాలనాపరమైన అన్ని విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా సత్య కుమార్ ధర్మవరం నియోజకవర్గాన్ని ఖచ్ఛితముగా ఉన్నత స్థానంలో నిలుపుతారని ఆకాంక్షించారు.
ఎన్నికల బరిలో తొలిసారి నిలబడి విజయం సాధించిన వై సత్య కుమార్ యాదవ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి పదవి లభించడం గర్వకారణంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత పదవులు పొందాలని పూల గుచ్ఛం అందించి సత్య కుమార్ ని సిరసనగండ్ల శ్రీనివాసరావు అభినందించారు.
