
సంపద కంటే చదువు ఎంతో గొప్పదని,చదువును కాపాడుకుంటే అది మనల్ని కాపాడు తుందని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏ సి పి జి.శంకర్ రాజు అన్నారు.బుధవారం సికింద్రబాద్ మడ్ ఫోర్డ్ ప్రభుత్వ ప్రైమరీ ,హైస్కూల్ ,బోయిన్ పల్లి పల్లవి మోడల్ స్కూల్ లో బేగంపేట టీ టీ ఐ ఆధ్వర్యం లో విద్యార్థులకు రోడ్ భద్రత,ట్రాఫిక్ నియమాల గురించి ఏ సి పి శంకర్ రాజు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపైన ఆవాహన కలిగి వుండాలని అన్నారు.రోడ్ భద్రత ,నియమాల గురించి బోధనాంశాలలో చేర్చాలని అన్నారు.పిల్లలు రోడ్ దాటే సమయం లో పాటించ వలసిన జాగ్రత్తలను వివరించారు.అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కూడా వివరించారు.జీబ్రా లైన్ వద్ద మాత్రమే రోడ్ దాటలన్నారు.సిగ్నల్ జంప్ చేయరాదన్నారు.ప్రతి ఒక్క వాహన దారుడు తప్పక హెల్మెట్ ధరించాలని అన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడప వద్దన్నారు. ఈ కార్యక్రమం లో 100 విద్యార్థులు ,ప్రధానోపాధ్యాయులు సుప్రద, షద్రక్,పల్లవి మోడల్. స్కూల్ ప్రిన్సిపాల్ రేణు చక్రవర్తి,సిబ్బంది పాల్గొన్నారు.

