కార్మికుల సంక్షేమం,అభివృద్ధి కోసం తలసాని శంకర్ యాదవ్ ఆన్న చేసిన సేవలు మరువలేనివి అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ కు మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఇటీవల శంకర్ యాదవ్ మరణించిన, విషయం తెలుసుకున్న ఇంద్రకరణ్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి లు గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం శంకర్ యాదవ్ మాతృమూర్తి లలితాబాయ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి ని తెలిపారు. కూరగాయల వర్తకులు, కార్మికుల సమస్యల పరిష్కార కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. శంకర్ యాదవ్ ను ప్రతి ఒక్కరూ ,శంకర్ అన్న, అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారని తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరం అన్నారు. శంకర్ యాదవ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధించారు. వారి వెంట హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్, శంకర్ యాదవ్ సోదరుడు తలసాని స్కైలాబ్ యాదవ్ తదితరులు ఉన్నారు.


