సికింద్రాబాద్ జోన్ పరిధిలో వర్షపు నీరు నిలువ స్థలాలను 17గా గుర్తించి వాటి వద్ద వర్షపు నీరు నిల్వకుండా నిలిచిన వెంటనే వాటిని తొలగించుటకు ట్రాఫిక్ పోలీసులతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన 17 పాయింట్లను జోనల్ కమిషనర్ రవి కిరణ్ పర్యవేక్షించి ట్రాఫిక్ పోలీసులతో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ రవి కిరణ్ మాట్లాడుతూ నార్త్ జోన్ పరిధిలో ఎక్కడ వర్షపు నీరు నిలిచిన, చెట్ల కొమ్మలు రోడ్లపై ఉన్న వాటిని వెంటనే తొలగించడం జరుగుతుందని ఒకవేళ తమ దృష్టికి రాని సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా అధికారులు దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని తొలగించి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది Control Room No.040- 2111111





