ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని బేగంపేట టి టీ ఐ ఎ సి పి జి.శంకర్ రాజు అన్నారు.
శుక్రవారం బేగంపేట ట్రాఫిక్ టైనింగ్ ఇనిస్టిట్యూట్ మరియు వారి సిబ్బంధి అద్వర్యంలో గోపాలపురం, సికింద్రాబాద్ లో 150 మంది ఆటో డ్రైవర్స్ కు ఉచితంగా యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఏ సీ పీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ అందరూ తప్పకుండా యూనిఫామ్ ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహనానికి సంబంధించి న అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు . ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలనీ, పరిమితికి మించి చార్జీలు వాసులు చేయరాదనీ వారిని హెచ్చరించారు . ట్రాఫిక్ నియమాలు అందరూ తప్పకుండా పాటించాలనీ, కొంతమంది డ్రైవర్లు చాలా స్పీడ్ గా , నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారనీ, ఇది ప్రమాదాలకు దారి తీస్తుందనీ అన్నారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు డ్రైవర్లకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎల్లప్పుడూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. చాలా మంది డ్రైవర్లు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడటం, మరణించిన సంఘటనలు కూడా గతంలో సంభవించాయి అని అన్నారు. ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనము నడపరాదు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమములో సుమారు 150 మంది ఆటో డ్రైవర్లు గోపాలపురం ట్రాఫిక్ సి.ఐ. పాల్గొన్నారు.



