‘ తాళ్లూరు’ అభివృద్ధికి కృషి -ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు

టీడీపీ కూటమి ప్రభుత్వ సహకారంతో మండల అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం తన చాంబర్లో భారీ కేక్ ను కట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. గ్రామా ల్లో సమస్యలను తమ దృష్టికి తీసుక వస్తే మండల కీలక నేతలు, ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. టీడీపీ మండల అధ్యక్షడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ …టీడీపీకి చెందిన వ్యక్తి ఎంపీపీగా ఉన్నందున మండలంలో కావాల్సిన అభివృద్ధి పనులను చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసు కుని రానున్న కాలంలో టీడీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈసందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి శ్రేణులు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావును దుశ్శా
లువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా మండల కాం ప్లెక్స్ వద్ద టీడీపీ వ్య వస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీపీ శ్రీనివాసరా వు, టీడీపీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి పూల మాలవేసి నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమంలో మానం రమేష్ బాబు, శాగం కొండారెడి, వల్లభనేని సుబ్బయ్య, మేడగం వెంకటేశ్వరరెడ్డి, షేక్ కాలేషావలి, గోపిరెడ్డి వెంకటే శ్వరరెడ్డి, షేక్ కాశీంసైదా, షేక్ మీరామొహిద్దీన్, చెన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, ఇడమకంటి శ్రీనివాసరెడ్డి, కె.రామకోటిరెడ్డి, జనసేన నేతలు కూటాల ప్రసా ద్, మారిశెట్టి హనుమంతరావు, బ్రహ్మయ్య, దగ్గుపాటి సుబ్బారావు, మారా బత్తుల సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *