బీ జే పీ నాయకులు నెమలి ఆనంద్ కు అభినందనల వెల్లువ……కబ్జా దారుల చెరనుంచి 10 ఎకరాల 20 గుంటల స్థలాన్ని కాపాడేందుకు పోరాటం చేసి విజయం……ప్రభుత్వ స్థలాలు, పరిరక్షించేందుకు ,ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాటం చేస్తానని వెల్లడి…..బీ జే పి నేతలు,పలు బస్తీలు,అపార్ట్మెంట్ వాసుల అభినందనలు…..

నీతి నిజాయితీ,ఆత్మస్థయిర్యం, తో చేపట్టిన పని ఏదైనా విజయం తప్పకుండా వరిస్తుంది ఆన్న నానుడి బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ విషయం లో మరోసారి రుజువైంది.బేగంపేట మాతాజీ నగర్ లో 10 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా దారుల చేతికి చిక్కకుండా ప్రజలకు ఉపయోగ పడేలా చేయాలన్న తలంపు తో ఒంటరిగా ఆనంద్ వేసిన ముందు అడుగు ఆ తర్వాత బస్తీ వాసులను ఏకతాటి పైకి తెచ్చింది.ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జా దారుల నుంచి రక్షించేందుకు ఆయన పోరాటం లో మాతాజీ నగర్ మొత్తం చేయి చేయి కలిపి ముందడుగు వేసేలా చేసింది .ఇలా ఆనంద్ చేసిన ఈ ప్రయత్నానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ,డిప్యూటి కలెక్టర్ ,హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వంటి అధికారులు సహకారం తో చివరికి అక్రమార్కుల చేతిలో చిక్కిన 10 ఎకరాల 20 గుంటల స్థలానికి గురువారం విముక్తి లభించింది. కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని నగరం నడిబొడ్డున బేగంపేట మాతాజీ నగర్ లో కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని కాపాడటం లో విజయం సాధించిన నెమలి ఆనంద్ కు అటు ప్రజలు,ఇటు బీ జే పి నేతలు,అపార్ట్ మెంట్లు వాసులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి.ఎన్నో ప్రోలోభలు ,బెదిరింపులు వచ్చినప్పటికీ వేసిన ముందడుగు వెనక్కి వేయక పోవడం ఆయన ధైర్యానికి నిదర్శనంగా సూచిస్తుంది.గురువారం మాతాజీ నగర్ సర్వే నెంబర్ 194/8/1 లో 10 ఎకరాలు 20 గుంటల స్థలం లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.దీంతో బీ జే పి నాయకులు,పలు బస్తీలు కాలనీలు,అపార్ట్మెంట్లు అసూసియేషన్ల నుంచి ప్రజలు ఆనంద్ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ స్థలాన్ని రక్షించడం లో కబ్జా దారులతో వెన్ను చూపనీ పోరాటం చేశారంటూ అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా బీ జే పి సీనియర్ నాయకులు లింగం పల్లి నరసింగరావు,ఆకుల మహేష్,మధుసూదన్,దయానంద తో పాటు రాష్ట్ర. నాయకుల నుంచి ఆనంద్ కు అభినందనలు అందుతూనే ఉన్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *