సినీ హీరో, నిర్మాత అయిన బూచేపల్లి కమలాకర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.చీమకుర్తిలోని పాటిమీదపాలెం రోడ్డులో కమలాకర్ స్మారకము వద్ద కమలాకర్ తల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళుల ర్పించారు. కమలాకర్ రెడ్డితో తో వారికున్న జ్ఞాపకా లను గుర్తు చేసుకున్నారు.
నివాళులర్పించిన వారిలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మండల రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యలు వేమా శ్రీనివాసరావు, పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మన్నం శ్రీధర్, బీమన వెంకట్రావు, సూది శ్రీనివ సరావు, మాలకొండయ్య,పాటిబండ్ల అశ్వద్దామ, మాజీ ఎంపీపీ పి.మధుసూదన్ రెడ్డి, మాజీ ముండ్లమూరు వైసిపి అధ్యక్షుడు అంజయ్య, మాజీ గుంటి గంగా భవాని కమిటీ చైర్మన్ కటకం శెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గంలోని పలువురు నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


