ఇద్దరు దొంగల మధ్య చోరీ సొత్తు పంపకాల్లో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. కత్తితో పొడిచి బండ రాళ్లతో మోది హత్య చేసిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్ పురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ ఏజీ కాలనీ సమీపంలోని నేతాజీ నగర్ కు చెందిన సయ్యద్ అజార్(22) ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆసిఫ్(23) తోడుదొంగలు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు పలు ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. 2023 లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కూడా చేశారు చోరీ సొత్తును విక్రయించి డబ్బుగా చేసుకుని ఇద్దరు పంచుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య చోరీ సొత్తు పంపకాల విషయంలో తేడా వచ్చింది. ఇదే విషయమై ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరు మద్యం తాగి భరత్‌నగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వెనుక మొదల్లోకి వెళ్లారు. అక్కడ మళ్లీ మద్యం తాగి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో మహమ్మద్ ఆసిఫ్ సయ్యద్ అజార్‌ను కత్తితో పొడిచి రాళ్లతో తలపై మోది హత్య చేసి అక్కడినుంచి పరారయ్యాడు బుధవారం మధ్యాహ్నం తానే మరోమిత్రుడైన అజీజ్‌కు ఫోన్ చేసి తాను సయ్యద్ అజార్‌ను హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో వేసిన విషయం చెప్పాడు. అంతకుముందే సయ్యద్ అజార్ తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సయ్యద్ హజార్ హత్యకు గురైనట్టు గుర్తించి కేసు విషయమై సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు సయ్యద్ అజార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న మహమ్మద్ ఆసిఫ్ కోసం గాలిస్తున్నట్టు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
చోరీ సొత్తు పంపకాలలో వివాదం……….కత్తితో పొడిచి,బండరాళ్లతో మోది హత్య………సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన………నిందితుని కోసం పోలీసుల వేట………..
20
Jun