అద్దంకి నుండి బొద్దికూరపాడు కు బుధవారం నుంచి కొత్తగా ఆర్టీసీ బస్ ను ఏర్పాటు చేశారు. నాలుగు దశాబ్దాల కిందట నుంచి అద్దంకి నుంచి బొద్దికూరపాడుకు ఆర్టీసీ బస్ ను నాలుగేళ్లుగా రద్దు చేశారు. తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల నుంచి అద్దంకికి నేరుగా బస్ సర్వీస్ లేకుండా పో యింది. సమస్యను ప్రజలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం నుంచి పునరుద్ధరించారు. అద్దంకిలో ఉదయం 5-30 గంటలకు బయలుదేరి ముండ్లమూరు, తాళ్ళూరు, తూర్పుగంగవరం మీదుగా 7-30 గంటలకు బొద్దికూరపాడు కు చేరుకొని తిరుగు ప్రయాణం లో అదే రూట్ లో ఉదయం 9-30 గంటలకు అద్దంకి చేరుకుంటుంది. సాయంత్రం 5-30 గంటలకు మరలా అద్దంకి లో బయలుదేరి బొద్దికూరపాడు వెళ్లి మరలా రాత్రి కి అద్దంకి చేరుతుంది. బస్ ఏర్పాటు పట్ల ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ అదికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుతం నడుపుతున్న ముండ్లమూరు మీదు గా కాకుండా మోదేపల్లి మీదుగా బస్ సర్వీసు నడిపితే మరింత ప్రయోజనంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు అభి ప్రాయపడుతున్నారు.
