ఏరువాక పున్నమితో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం -రైతులకు మెళకువలు తెలియజేసిన ఏఓ ప్రపాదరావు

ఏరువాక పున్నమితో రైతులు సాగుకు సన్నద్ధం కావాలని మండల వ్యవ సాయాధికారి బి. ప్రసాదరావు తెలిపారు. మండలంలోని కొత్తపాలెం, తాళ్లూరు గ్రామాల్లో శుక్ర వారం క్షేత్ర పర్యటనలో భాగంగా నారుమడులు సన్నద్ధతపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సకాలంలో వర్షాలు పడ డంతో రైతులందరూ సాగుపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. వరి నారుమడులలో నూతన యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకోవా లన్నారు. నారు మొలకెత్తిన తర్వాత ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు ఆరు తడులు ఇచ్చి తర్వాత నీరు పలుచగా నిలకట్టాలన్నారు. జింక్ లోపాన్ని గుర్తిస్తే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని, ఇనుప ధాతు లోప నివారణకు 20 గ్రాముల అన్నబేధీ, రెం డు గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలన్నారు. విత్తిన పది రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలన్నారు. కార్యక్రమంలో వీఏఏ నాగరాజునాయక్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *