బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ను చెత్త లారీ వెనుక వైపు నుంచి
ఢీ కొన్న ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. డివైడర్ మధ్య ఉన్న చెట్లకు నీరు పడుతున్న ట్యాంకర్ ను వెనుక వైపు నుంచి వచ్చిన చెత్త లారీ బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానప్పటికి లారీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడం,ఆ సమయం లో పెద్దగా ట్రాఫిక్ లేక పోవడం తో పెద్ద ప్రమాదం తప్పింది.దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. లారీలను తొలగించేందుకు తీసుకువచ్చిన క్రేన్ సరిగా పనిచేయక పోవడం తో ప్రమాదానికి గురైన లారీ అక్కడే ఉంది.పోలీస్ లు వేరే వాహనం తెచ్చి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
