రసూల్ పుర విమాన నగర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న టెలిఫోన్ కంపెనీకి సంబంధించిన బాక్స్ రోడ్డు మీదికి ఒరిగిపోయింది దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉంది. ఒరిగిపోయిన టెలిఫోన్ బాక్స్ ను గుర్తించకుండా వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.అలాగే పాఠ శాలకు సైకిళ్ల పై వెళ్ళే చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశం వుందని వారి తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సంబంధిత శాఖ అధికారులు ఒరిగిపోయిన టెలిఫోన్ బాక్స్ బాక్స ను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
