శ్రీ హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 165 మంది విద్యార్థులు ఎంపికయినట్లు ప్రిన్సిపాల్ దాది ఆంజనేయులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన టెక్ మహీంద్ర కంపెనీకు చెందిన 15 మంది విద్యార్థులు రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో, సుతర్ ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీకి 15 మంది విద్యార్థులు రూ. 3లక్షల వార్షిక వేతనంతో, జెన్ప్యాక్ట్ కంపెనీకి 60 విద్యార్థులు రూ. 2.4 లక్షల వేతనంతో, అరబిందో ఫార్మసీ కంపెనీకి చెందిన 16 మంది విద్యార్థులు రూ. 2లక్షల వేతనంతో, బెంగుళూరుకు చెందిన ఆల్సెక్ కంపెనీకి 36 మంది విద్యార్థులు రూ. 2.13 లక్షల వేతనంతో, ఒంగోలుకు చెందిన ఎసీఈ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యునికేషన్ స్కిల్స్ అకాడమికి 23 మంది విద్యార్థులు రూ. 18 లక్షల వేతనంతో ఎంపికయినట్లు వివరించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 775 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయినట్లు చైర్మన్ గోరంట్ల రవికుమార్ చెప్పారు. నూతనంగా ఎంపికయిన విద్యార్థులను చైర్మన్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, ఎవో ర్యాంకర్స్ శ్రీనివాసరావులు అభినందించారు.
