కేంద్రమంత్రి ,బండి ,ని డిల్లీ లో కలిసి అభినందనలు తెల్పిన నెమలి ఆనంద్ (నందు)………………..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను సీనియర్ బిజెపి నాయకులు ఆనంద్ (నందు )ఢిల్లీలో సోమవారం కలిసి అభినందనలు తెలియజేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ ను ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన పలువురు బిజెపి యువ నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి వారికి తన నివాసంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెమలి ఆనంద్ (నందు) మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి అన్నారు. బిజెపి కార్యకర్తగా నాయకునిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నేడు కేంద్ర మంత్రిగా ఆయన ఎదిగిన
తీరు పలువురికి ఆదర్శం అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన రాష్ట్రానికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల లో బిజెపి నీ అధికారం లోకి తీసుకు రావడమే యువత లక్ష్యం గా పెట్టు కోవాలి అని ఆనంద్ అన్నారు.ప్రధాని మోడీ మంత్రి వర్గం లో రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి,బండి సంజయ్ కుమార్ లు కేంద్ర మంత్రులు గా వారి లక్ష్యాలను సాధిస్తారన్న నమ్మకాన్ని ఆనంద్  వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *