డాక్టర్ కాలేషా సేవలు రైతులు మరవలేరు -డాక్టర్ కాలేషాను సన్మానించిన పశుసంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది

ప్రకాశం జిల్లాలో 37 ఏళ్లపాటు సుదీర్ఘంగా పశువైద్యుడిగా విధులు నిర్వర్తించిన పశుసంవర్థక శాఖ డీఎల్డీఏ డాక్టర్ కాలేషా సేవలను గ్రామీణ ప్రాంత రైతాంగం ఎన్నటికీ మరవలేరని పశుసంవ ర్థకశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ వెంకట్రావు అన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా నిబద్ధ తతో వ్యవహరించిన కాలేషా.. విశ్రాంత జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఒంగోలు, దర్శి, పామూరు, కందుకూరుల్లో ఎస్ఎల్బీపీ, ఉప సంచాలకులు, సంయుక్త సంచాలకులు, కార్యనిర్వ హణాధికారి, డీఎల్డీఏగా వివిధ హోదాల్లో పనిచేసి ఇక్కడే రిటైర్ కావడం అరుదైన విషయమన్నారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.శ్రీనివాస రావు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రజనీకుమారి, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ బేబీరాణి, బాపట్ల
పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ హనుమంతరావు ప్రసంగించగా, ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు వెంకరామిరెడ్డి, సుధీర్, బసవ శంకరరావు పాల్గొన్నారు. అనంతరం కాలేషా దంపతులను ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *