ముండ్లమూరు మండలంలో ఒకే రోజు ముగ్గురు మృతి చెందడం జరిగింది. పసుపుగల్లు, బొప్పిడి వారి పాలెం, ఉల్లగళ్ళు గ్రామాలలో ముగ్గురు వ్యక్తులు మృతదేహాలు లభ్యం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాలకు చేరుకొని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముగ్గురి మృతికి కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తుంది. వీరిలో ఒకరు ఒంగోలు హాస్పిటల్ లో మృతి చెందగా, మరో ఇద్దరు ఆయా గ్రామ శివారు ప్రాంతాలలో మృతి చెందినట్లు సమాచారం.
