మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షులు శంకర్ యాదవ్ మరణించారు. శనివారం సాయంత్రం కేంద్రమంత్రి బండి సంజయ్ వెస్ట్ మారేడ్ పల్లి లోని రాధికా కాలనీలో గల శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొన్నారు. శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, తలసాని శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన వెంట బిజెపి కార్పొరేటర్ లు దీపిక, చీర సుచిత్ర శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, తలసాని శంకర్ యాదవ్ సోదరులు ఉన్నారు




