విద్యార్థులు ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర రాజు అన్నారు.గురువారం
బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంధి అద్వర్యంలో బొల్లారం రిసాల బజార్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి అన్నారు, అంతెకాకుండా రోడ్డు భద్రత, నియమాల గురించి వారి బోధనాంశాలలో కూడా చేర్చాలనీ అన్నారు. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలి అన్నారు. పిల్లలు రోడ్డు దాటే సమయంలో ఏ విదమైన జాగ్రత్తలు పాటించాలి అని విద్యార్థులకు తెలియజేసారు. చిన్నతనం నుండే ట్రాఫిక్ నియమాల పై అవగాహన పెంచుకొని వాటిని పాటించాలి అని అన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి వివరించడం జరిగింది. రోడ్ దాటునప్పుడు తప్పకుండ జీబ్రా లైన్ వద్ద మాత్రమే దాటాలన్నారు.ఫుట్ పాత్ లను ఉపయోగించుకోవాలి అన్నారు. సిగ్నల్ జంప్ చేయరాదనీ, అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు, ఇది చట్టరీత్యా నేరం అని తెలిపారు. ఆటోలో ఐదుగురికంటే ఎక్కువ విద్యార్థులు వుంటే ఆ ఆటో ఎక్కరాదన్నారు. డ్రైవర్ తాగివున్నా అలాంటి ఆటోలో ప్రయాణించరాదు అని అన్నారు. స్కూల్ యాజమాన్యం కూడా అలాంటి ఆటోల పై నిఘా ఉంచాలన్నారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలి అన్నారు. అతి వేగంతో స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్లను గుర్తించి యాజమాన్యం వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమములో సుమారు 150 మంది విద్యార్ధులు మరియు హెడ్ మాస్టర్ సునీత వారి సిబ్బంది పాల్గొన్నారు.


