శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 49వేల 647 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం : 838.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 60.2171 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
