దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి దిశగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అడుగులు -కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు తో జరిపిన చర్చల్లో సానుకూలత

మంగళగిరి సికే కన్వెన్షన్ లో మంగళవారం జరిగిన డ్రోన్ సమ్మిట్ లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడుతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించారు. విమానాశ్రయ నిర్మాణం సాధ్యా సాద్యాలను వివరించారు. ఈ సందర్భంగా దొనకొండ వెనుకబడిన ప్రాంతమని, వలసలను నివారించే లక్ష్యంతో విమానాశ్రయానికి కేటాయించిన 354 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ లక్ష్మి మంత్రి కి వివరించారు. ముఖ్యంగా పౌర విమానయాన అనుబంధ కేంద్రంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించి యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు. దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు ఈ మేరకు దర్శి ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా దొనకొండ పారిశ్రామిక వాడ అభివృద్ధికి మాట ఇచ్చారని ఆమె వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధికారులతో సమీక్షించి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు పెద్దలు మాగుంట శ్రీనివాస రెడ్డి తో కలిసి పరిశీలించి ఈ ప్రాంతా అభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు. అనుకూలమైన ప్రభుత్వ భూమి 354 ఎకరాలు ఉందని యువ నాయకులు వెనకబడిన ప్రాంతాల బాధలు తెలిసిన మంత్రి రామ్మోహన్ తోనే సాధ్యమని.. డాక్టర్ లక్ష్మి అభిప్రాయపడ్డారు. అందుకే మన ప్రాంత పరిస్థితులపై మంత్రి కి తెలియజేయడం జరిగిందన్నారు. వెనుకబడిన దొనకొండ ప్రాంతం నుండి ప్రతి ఏడాది వందలాది మంది హైదరాబాద్, బెంగళూరు చెన్నై వలసలు వెళ్లి ఉపాధి పొందుతున్నారని వారికి జీవనోపాధి కల్పించే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి అవసరమని అందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. దొనకొండలో విమానాశ్రయ ప్రాంతానికి కేటాయించిన స్థలాన్ని అనుబంధ వర్క్ షాప్ గా వినియోగించుకొని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించిన సంపూర్ణ నివేదికతో అధికారులతో కలిసి రావాలని కోరారు. మన కూటమి ప్రజా ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రకాశం వంటి జిల్లాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులను కూడా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దొనకొండ ప్రాంత అభివృద్ధికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎలా చేస్తే బాగుంటుంది, ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని, త్వరలో ఇందుకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహిద్దామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. దీనిపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ .. దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి వలసలు నివారించే లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా మంత్రి సానుకూలంగా మాట్లాడడం దర్శి ప్రాంత ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక తొలి ప్రయత్నంగా ఆమె పేర్కొన్నారు, త్వరలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తో కలిసి మంత్రి రామ్మోహన్ నాయుడు తో దొనకొండ ప్రాంత పారిశ్రామిక వాడను ముందుకు తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో విద్యాశాఖమాత్యులు గౌరవనీయులు లోకేష్ బాబు తో కూడా దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే అందుకు కృషి చేస్తానని డాక్టర్ లక్ష్మి హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *