నెల్లూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హరిత హోటల్ ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ( ఏపీటీడీసీ) చైర్మన్ డా. నూకసాని బాలాజీ
పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించేలా హోటల్ కు తగిన ప్రాచుర్యం కల్పించాలని, హైవేపై డైరెక్షన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న వసతికి సంబంధించి అందరికీ తెలిసేలా తగువిధంగా ప్రచారం కల్పించాలని సూచించారు. తనిఖీలో నెల్లూరు డివిజన్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు







