తెల్లదోమ, రసం పీల్చే పురుగులు వైరస్ తెగుళ్ల వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తాయని వాటిని అరికట్టడానికి పొలం గట్ల వెంబడి మూడు వరుసల్లో జొన్న లేదా మొక్క జొన్న పైర్ల ను పెంచుకోవాలని తద్వారా పురుగుల ప్రవేశాన్ని కట్టడి చేయవచ్చని మండల వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అన్నారు. మల్కాపురం, రజా నగరం, విఠలాపురం గ్రామాల్లో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ ఎకరానికి వంద బంతి చెట్లు నాటు కోవాలని, నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 చొప్పున అమర్చాలని ముందస్తు చర్యగా వేప నూనె పిచికారి చెయ్యాలని చెప్పారు. కలుపు నివారణ ఎప్పటి కప్పుడు శుభ్రం చెయ్యాలని సూచించారు.
