భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల బలోపేతానికి కృషి చేస్తాను -బిజెపి జిల్లా అధ్యక్షులు శెగ్గం శ్రీనివాసరావు -బిజెపి నూతన అధ్యక్షులు శ్రీనివాసరావును సత్కరించిన విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు.

భారతీయులంతా హిందువులే, వేద కాలంనాటి నుండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే… బయట నుంచి దేశంలోకి వలస వచ్చిన కొన్ని మతాలు వారు మన ఆలయాల వద్ద వ్యాపారాలు చేసుకుంటూ, వారి మతాన్ని ప్రచారం చేసుకుంటూ హిందువులని తమ మతంలోకి మార్చుకుంటూ… వారి ద్వారా మన పైనే దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. హిందువులుగా మనం ఎప్పుడూ అన్య మతస్తులను మన మతం స్వీకరించమని, వారి మందిరాల వద్ద ప్రార్థన స్థలాల వద్ద ప్రచారం చేసుకోవడం లేదు, వారిపై దాడులు చేయడం లేదు. మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు దానిని చేర్చడానికి మన వంతుగా మనం పని చేసుకుంటున్నాం. అనాదికాలంగా మన నాణాలపై ఉన్నటువంటి దేవతామూర్తుల చిత్రాలు, కమలం బొమ్మ, అలాంటివన్నీ కూడా ప్రస్తుతం కనుమరుగైపోయాయి. మన పిల్లలు ఉద్యోగ రీత్యా చదువు రీత్యా విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న పాశ్చార్య సంస్కృతిని అలవాటు చేసుకొని తద్వారా మన హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని మర్చిపోతున్నారు. కారణం మనం స్వాతంత్య్రం సాధించిన తరువాత అప్పటి పాలకుల నిర్ణయాల వల్ల విద్యావ్యవస్థలో ఆంగ్లేయులు, మొగలాయిలు తదితర భారతదేశ పైకి దండెత్తి వచ్చినటువంటి వారిని గొప్పగా చూపించి, మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యావ్యవస్థ నుంచి దూరం చేశారు. కావున మరల మన వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి తద్వారా భావితరాలకు ఉన్నత భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాలని తెలుపవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శెగ్గం శ్రీనివాసరావు అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బిజేపి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శెగ్గం శ్రీనివాసరావును అభినందించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు అధ్యక్షతన పరిషత్ కార్యకర్తలు సుందరయ్య భవన్ రోడ్డు లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేసి శెగ్గం శ్రీనివాసరావును సత్కరించారు. తనకు చేసిన సత్కారానికి ధన్యవాదములు తెలిపిన శ్రీనివాసరావు కొత్త పాత కలయికతో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానని అనుబంధ సంస్థల తో సంయుక్త కార్యాచరణ చేస్తూ సమాజంలో ఉన్నతమైన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలను పెంపొందించడానికి కృషి చేస్తానని శెగ్గం తెలిపారు.

శెగ్గెం సత్కార కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఇనమనమెళ్ళూరి సీతారామయ్య, ఈమని బలరాం, గడ్డం శ్రీనివాసులు, సాధు శ్రీనివాస గుప్తా, నేరెళ్ల శ్రీనివాసరావు, త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, పసుమర్తి వేంకటేశ్వర్లు, పెరుమాళ్ళు, జిల్లా ప్రచార ప్రముఖ్ రాధా రమణ గుప్తా జంధ్యం, పి శ్రీనివాసరావు, మరియు బిజేపి పూర్వ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, శివాజి యాదవ్, పి. తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *