కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025_2026 బడ్జెట్ హర్షనీయం… బి విజయారావు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దేశవ్యాప్తంగా వరుసగా ఎనిమిదో సారి  ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే విధంగా ఉందని  భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా  మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బీ. విజయ రావు తెలిపారు.
        ఈసందర్భంగా  విజయరావు  మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశంలోని గ్రామాలు పట్టణాలు నగరాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ నందు గరీబ్ యూత్ అన్నదాత నారీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. సబ్ కాసాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చేపట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చాంసినీయంగా మారాయని చెప్పారు. భారత్ అధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా నిలిచిందని అన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కిన తరువాత దేశం ముందుకు వెళ్లే దిశగా అన్ని విధాల కృషి చేస్తుందని మళ్లీమళ్లీ మనం భారతీయ జనతా పార్టీ నే అధికారంలోకి ఎల్లప్పుడూ ఉండే విధంగా. చూడాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు నిర్మల సీతారామన్ తదితర నాయకులందరికీ రుణపడి ఉంటామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *