తాళ్లూరు మండలంలోని ఈబీసీ కింద కాపు(బలిజ) తెలగ, ఒంటరి కులాలకు కాపు కార్పొరేషన్ పథకాలకు సంబంధించి 2024 2025 సంవత్సరం చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాలకు ఆయా లబ్దిదారులు ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఏపీ ఓబీఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టర్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని ఎంపీడీఓ దారా హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. లబ్దిదారులు ఆయా ఆన్లైన్ పోర్టల్లో సబ్సిడీతో కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు నమోదు చేసుకోవాలని, అర్హత కలిగిన లబ్దిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం
02
Feb