ఉన్నత చదువులు చదవాలి – తాళ్లూరు బి. సి వసతి గృహ సంక్షేమ అధికారి తేరేజమ్మ

ప్రభుత్వం పేదవర్గాల అభ్యున్నతి కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసినందున వసతి గృహాల్లోని విద్యార్థులు కష్టించి ఉన్నత చదువులు చదవాలని బీసీబాలికలవసతిగృహా సంక్షేమ అధికారి తేరేజమ్మ తెలిపారు. స్థానిక బీసీబాలికల వసతి గృహవార్షికోత్సం, తల్లిదండ్రుల సమావేశం ఆదివారం జరిగింది. ఈసందర్బంగా పేదవర్గాల కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. వసతి గృహాలందున్న విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా ఉన్నతులుగా నిలిచి మంచి పేరు తెచ్చకోవాలన్నారు. వసతి గృహాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. పదవతరగతి బాలికలు కష్టపడి చదివి నూరు శాతంఉత్తీర్ణత సాధించి వసతి గృహానికి మంచి పేరు తీసుక రావాల న్నారు. ఈ కార్యక్రమంలో వసతిగృహబాలికలు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *