కేవైసీ అప్డేట్ పేరుతో మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి. అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల విద్యార్థులు ఎంతో అప్రమత్తంగా ఉండాలంటూ, మహంకాళి ఇన్స్పెక్టర్ కే.పరుశురాం విద్యార్థులకు సూచించారు. సోమవారం మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తపస్యా కళాశాలలో మహంకాళి ఇన్స్పెక్టర్ కె పరుశురామ్ ఆధ్వర్యంలో ఎస్సై సుబ్రహ్మణ్యం ,సైబర్ క్రైమ్ వారియర్ శ్యామ్ లు విద్యార్థులకు జరుగుతున్న సైబర్ నేరాలను గురించి స్కిట్ రూపంలో ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బంది అని చెప్పి పరిచయం చేసుకుని ఫోన్లో సంప్రదిస్తూ మీ కేవైసీ అప్డేషన్ చేయాలని మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అంటూ తెలుసుకోవడం జరుగుతుందనీ, బెట్టింగ్ యాప్స్ వాట్స్అప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ టెలిగ్రామ్ యాప్ లకు లింకులను పంపించి వాటిని క్లిక్ చేయడం ద్వారా వారి అకౌంట్ నుంచి సమాచారాన్ని తీసుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా అమౌంట్ కట్ చేసుకుంటారని అందుకే తెలియని నెంబర్ నుంచి వాట్స్అప్ వీడియో కాల్ చేయడం తక్కువ రేట్లకు మొబైల్స్ క్లోత్స్ వెహికల్స్ అనే పేర్లు పెట్టి అమాయకులను మోసం చేయడం జరుగుతుందని అన్నారు అలాంటి మోసాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ వారికి సూచించారు ఏదైనా సైబర్ నేరం జరిగినట్లయితే 1930కు కాల్ చేసి ఏ నెంబర్ నుండి ఈ మెయిల్ గాని లింకు వచ్చిందో తెలియజేసినట్లయితే వాటిని బ్లాక్ చేసి పోయిన అమౌంట్ ని ఆపే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు అవగాహన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
