బేగంపేట నుంచి భరత్ గౌడ్ ప్రమాణస్వీకారం ఉత్సవానికి తరలి వెళ్లిన బిజెపి శ్రేణులు……………

మహంకాళి జిల్లా నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గుండగోని భరత్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవానికి సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట నుంచి బేగంపేట్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్ ,నెమలి ఆనంద్ ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు .పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కణేష్ ఫంక్షన్ హాల్ కు తరలి వెళ్లారు. ర్యాలీగా బయలుదేరి వెళుతున్న సమయంలో రాజ్యలక్ష్మి ఆనంద్ లు మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో బిజెపి పార్టీ ఎంతో బలంగా ఉందని ,బేగంపేటలో కూడా బిజెపిని బూత్ స్థాయిలో పటిష్ట పరుస్తామని అన్నారు. మహంకాళి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న గుండగోని భరత్ గౌడ్ నేతృత్వంలోపార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రతి కార్యకర్త బిజెపి జెండాను సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రెపరెపలాడించేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలియజేశారు .అనంతరం వారు ర్యాలీగా తరలి వెళ్లారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *