పేద మధ్యతరగతి వర్గాలకు అండగా దళిత చైతన్య సంఘం -వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ

పేద మధ్యతరగతి వర్గాలకు అండగా దళిత చైతన్య సంఘం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ అన్నారు. ఈ మేరకు దళిత చైతన్య సంఘం ఏర్పడి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సనత్ నగర్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద నిరుపేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ తన తల్లి శాంతాబాయి చేతుల మీదుగా పేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముప్పిడి నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళితులను ఏకం చేస్తూనే.ఇతర కులాలు, పేద మధ్యతరగతి వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు.ఎప్పటికప్పుడు పేద ప్రజలు సమస్యలను తెలుసుకుని వాటిని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు.అంతకు ముందు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎల్లమ్మ తల్లి పాదాల వద్ద .పేదలకు ఉచితంగా పంపిణీ చేసే చీరలను పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడితోపాటు అభిషేక్, సందీప్,రత్నమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *